సర్వాయి పాపన్న ఆశయసాధకుడు కేసీఆర్
బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేసిన పాపన్న గౌడ్
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఆగష్టు 18 (వాయిస్ టుడే): సర్వాయి పాపన్న ఆశయ సాధకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, గోల్కోండ కోటపై జెండా ఎగరెసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని.. ఆయన జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ లో సర్వాయి పాపన్న 373 జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు పోరాట యోధులను , మహానీయులను సమైక్య ప్రభుత్వం విస్మరించిందని ..తెలంగాణ ప్రభుత్వం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తుందని..బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ది అని.. ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతఒక్కరు ఆదర్శంగా తీసుకోని రాజ్యాధికారమె లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఆయన చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని పునరుద్ఘాటించారు. 300 సంవత్సరాలకంటే ముందే బహుజన రాజ్యం కోరకు గోల్కోండ కోటను అధిరోహించి గోల్కోండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేసారు. పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా బిసి సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని , పేత్తందారులను ఎదురించి పెద ప్రజలకు అండగా నిలిచారని ఆదుకున్నరని అన్నారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ బి గోపి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి,నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ప్రభుత్వ విప్ MLC పాడి కౌశిక్ రెడ్డి, బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, రెడ్డ వేణి మధు, కలర్ సత్తన్న, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.