మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్
Pawan Kalyan effect in Maharashtra
మహారాష్ట్రలో పనిచేసిన పవన మంత్రం
– ఇరిగెల రాంపుల్లా రెడ్డి
– ఆళ్లగడ్డ జనసేన పార్టీ ఇంచార్జ్
ఆళ్లగడ్డ
మహారాష్ట్రలో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఈ విజయంలో కీలకపాత్ర పోషించారని ప్రధానమంత్రి తనపై పెట్టిన బాధ్యతను శక్తి వంచన లేకుండా పవన్ కళ్యాణ్ నెరవేర్చారని ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ఇరిగెల రాంపుల్లా రెడ్డి అన్నారు. దేశంలో ఎన్ డి ఏ కూటమిని ప్రజలు ఆదరిస్తున్నారని ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని ఎన్ డి ఏ పక్షంలో జనసేన పార్టీ రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. రాష్ట్రంలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారని అలాగే ముఖ్యంగా ఆళ్లగడ్డ తాలూకాలో జనసేన పార్టీని ఒక బలమైన శక్తిగా తయారు చేస్తామని తెలిపారు ఇప్పటికే తాలూకాలో 5200 పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికులు వీర మహిళల మీద ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాలూకా అధికార ప్రతినిధి ఇరిగెల సూర్య నారాయణ రెడ్డి , మిద్దె రాంపుల్లయ్య, తాలూకా ఎస్సి నాయకులు డాలు రత్నమయ్య, సజ్జల నాగేంద్ర, టౌన్ ఇంచార్జ్ ఎమ్మెస్ మహబూబ్ హుస్సేన్ , షేక్ ఖాదర్ బాషా, చంద్రారెడ్డి ,రాంపల్లె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.