Friday, November 22, 2024

వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన  పవన్ కళ్యాణ్

- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
స్వామి వారికి ప్రత్యేక పూజలు..

వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన  పవన్ కళ్యాణ్
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రం పరిశీలన

Pawan Kalyan laid the Varahi Declaration at Srivari’s feet

తిరుమల,
సనాతర ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన  పవన్ కళ్యాణ్  బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజుల పాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్  బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలి కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. మూడంచల భద్రతలో ఉన్న   పవన్ కళ్యాణ్  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆలయ ఆధికారులు తమ విశిష్ట అధికారాలు ఉపయోగించి మహాద్వార ప్రవేశం చేయించారు. తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. క్యూ లైన్లలో అధికంగా భక్తులు ఉండడంతో కేవలం కొద్ది సమయం మాత్రమే స్వామి వారి సేవలో పాల్గొని వెలుపలికి విచ్చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు అయనకు  ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాకు వారాహి డిక్లరేషన్ ప్రతులను చూపించారు.

తృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాద స్వీకరణ

స్వామి వారి దర్శనం అనంతరం అయన  నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు అయనకు స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ద

తిరుమల శ్రీవారి దర్శనానికి మొదటి సారి వచ్చిన పవన్ కళ్యాణ్  చిన్న కుమార్తె కుమారి పొలెనా అంజలీతో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగాఅయన  డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు. కుమారి పొలెనా అంజలి తల్లి  అనా లెజినోవా  క్రైస్తవం పాటించడంతో పిల్లలు కూడా క్రైస్తవమత సంప్రదాయాల ప్రకారం పెరగడంతో ఆలయ నియమాలను అనుసరించి డిక్లరేషన్ ఇప్పించారు. పలు సందర్భాల్లో తన ఇద్దరు పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అన్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన విషయం విధితమే.  పవన్ కళ్యాణ్ తో పాటు శాసన మండలి సభ్యులు  పిడుగు హరిప్రసాద్, , తిరుపతి, రైల్వే కోడూరు శాసన సభ్యులు  ఆరణి శ్రీనివాసులు,  అరవా శ్రీధర్,  జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్