Sunday, March 30, 2025

పవన్ కల్యాణ్ రెండు గంటల పాటు మౌన దీక్ష

- Advertisement -

విజయవాడ, అక్టోబరు 2:  రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ సర్కార్ ప్రభుత్వం చంపేసిందన్నారు పవన్ కల్యాణ్. రాజకీయాల్లోకి వస్తే బురద పడుతుందని తెలుసని, అయినా ముందుకే సాగుతానన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమన్న ఆయన, జగన్‌ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, జగన్‌ ఆలోచన, పాలన నిర్ణయాలను మాత్రమే  వ్యతిరేకిస్తున్నానని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు. మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపానికి వచ్చిన పవన్, జాతిపిత జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Pawan Kalyan started silence for two hours
Pawan Kalyan started silence for two hours

రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా  రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టారు. పవన్ కు సంఘీభావంగా జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు దీక్షలో కూర్చున్నారు. అంబేద్కర్ ను రాజ్యాంగ కమిటీకి అద్యక్షుడిని చేసింది మహాత్మా గాంధీ. తనను విభేదించినా కూడా అంబేద్కర్ కు గాంధీ సముచిత స్థానం కల్పించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. మచిలీపట్నం లాంటి నేలపై గాంధీ జయంతి జరపడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బందర్ గొప్పతనం ఏంటంటే, జనసేన అవిర్బావ సభలో జాతీయ గీతం రాగానే పది లక్షలమంది లేచి నిలబడ్డారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేశాక గాంధీ జయంతిని మచిలీపట్నంలో జరుపుతామని పవన్ అన్నారు. జైజవాన్ జైకిసాన్ పిలుపునిచ్చిన వ్యక్తి లాల్ బహుదూర్ శాస్త్రి. ఆయన ప్రేరణతో భవిష్యత్ తరాలకు విలువలతో కూడిన రాజకీయాలతో జనసేన ముందుకెళ్తుందని పవన్ అన్నారు. ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో పార్టీ పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి విజయ యాత్ర, ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి టీడీపీ-టీడీపీ సంకీర్ణమే టీకా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి ప్రభుత్వమే వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ 175 సీట్లు గెలుస్తామని, వైసీపీ 15 సీట్లు వస్తే గొప్ప అని అన్నారు. జగన్ ఇసుక దోపిడీ, అవినీతి గురించి ప్రధాని దృష్టికి తీసకెళ్దామనుకున్నట్లు పవన్‌ కల్యాణ్ వెల్లడించారు. జగన్ వేల కోట్ల అవినీతి గురించి దేశ ప్రధానికి తెలియదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించటమే జనసేన లక్ష్యమని, ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ కోసం కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చా

Pawan Kalyan started silence for two hours
Pawan Kalyan started silence for two hours
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్