శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
అమరావతి
Pawan Kalyan started the circumambulation route of Srikalahasti Giri
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.వైసీపీ హయాంలో పాలకమండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలకమండళ్లు పని చేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికీ ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలతం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు.



