Sunday, September 8, 2024

చంద్రబాబు కుటుంబాన్నిపరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

- Advertisement -

చంద్రబాబు పై నేరం రాజకీయ కక్ష

రాజమండ్రి, సెప్టెంబర్  :  అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్ర సర్వనాశనం అవుతుంది. ప్రతి వీధిలో ఘర్షణలు కనిపిస్తాయి. మా నాయకులు నిరసన తెలిపినందుకు హత్యానేరం మోపారు. చంద్రబాబుపై మోపిన నేరం కూడా రాజకీయ కక్ష. దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇవాళ్టి భేటీ చాలా కీలకమైంది. దేశం బయటకు వెళ్లాలంటే ఈ నేరస్తుడు కోర్టు పరిమిషన్ తీసుకోవాలి. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. దేశ చట్టాలను కూడా ఖాతరు చేయడం లేదు. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాలంటీర్‌తో డేటా చౌర్యం చేస్తూ చట్టాలు ఉల్లంఘిస్తున్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పోనీ రాష్ట్రంలో అభివృద్ధి మైనా ఉందా.. ఇచ్చిన హామీలు ఏమైనా నలిబెట్టుకున్నారు. సీపీఎస్ రద్దు చేస్తానన్న వ్యక్తి చేశాడా. లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వ్యక్తి ఉద్యోగాలు ఇచ్చారా. లిక్కర్‌లో అడ్డగోలుగా దోస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి కూడా బాగాలేదు. ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయం చెప్తే దాన్ని ప్రతిఘటించకూడదంటే ఎలా… నా లాంటి వాడిని రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేస్తామంటే ఎలా… రోడ్డుపై తిరగకూడదు.. ఎవరూ చేతులు చూపకూడదు.. బండిలో  ఉండి బయటకు రాకూడదు అంటే ఎలా.. బ్యాంకులో సిబ్బంది చేసిన తప్పునకు బ్యాంకు మేనేజర్‌ని తప్పుబడుతామా? ప్రతి విషయాన్ని సీఎంకి లిక్ చేస్తామా. గతంలో దీన్ని గుజరాత్‌ లాంటి రాష్ట్రంలో కూడా అమలు చేశారు. సైబరాబాద్‌ సంపూర్ణమైన సిటీ నిర్మించిన వ్యక్తికి 300 కోట్ల రూపాయల స్కామ్‌ను చుట్టి ఇలా జైల్లో పెట్టడం బాధకలిగించింది. తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇతరులపై నేరాలు మోపుతూ జైల్లో పెడుతున్నారు. నేను తీసుకునే నిర్ణయాలు చాలా మందికి బాధ కలిగిస్తాయి. 2014లో కూడా ఇలాంటివి విన్నాను. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మోదీకి అప్పట్లో మద్దతు తెలిపాను.  2019లో పాలసీ విధానంతోనే చంద్రబాబుతో విభేదించాను. నేను ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడను.

Pawan Kalyan visited Chandrababu's family
Pawan Kalyan visited Chandrababu’s family

టీడీపీ, జనసేన పొత్తు

రాజమండ్రి సెంట్రల్‌ జైలు సాక్షిగా టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. జైలు బయట జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పొత్తును కన్ఫామ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాము కలిసి వెళ్తేనే వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగలమని చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే ఎదుర్కోలేమని చెప్పుకొచ్చారు. వైసీపీని సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి మద్దతిచ్చే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇది వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని ఫైర్ అయ్యారు.2024లో ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయి. తమతో కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నది తన ఆకాంక్ష అని చెప్పిన పవన్.. అందుకు తగ్గట్టుగా జనసేన-టీడీపీ కలిసి పని చేస్తాయన్నారు. చంద్రబాబుపై బీజేపీ కుట్ర ఉంటుంది అని తాను నమ్మట్లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. జగన్‌కు మిగిలింది ఇక 6 నెలలే అని.. ఆయన యుద్ధం కోరుకుంటే.. దానికి తాము సిద్దంగా ఉన్నామని పవన్ తెలిపారు.తన కోనసీమ పర్యటన సమయంలో సీఎం జగన్ 2 వేల మంది క్రిమినల్స్‌ను దింపారని.. ఇంటిలిజెన్స్ అప్రమత్తంతో అలెర్ట్ అయ్యాయని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నది తన ఆకాంక్ష అని చెప్పిన పవన్.. రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుందని.. అది రాజశేఖర్ రెడ్డిలో ఉందని చెప్పుకొచ్చారు.టీడీపీ-జనసేన కలిసి పని చేస్తాయని వెల్లడించారు. తమతో బీజేపీ కూడా కలిసి ముందుకు వస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని పవన్ చెప్పారు. ఇవాళే ఈ పొత్తు నిర్ణయం తీసుకున్నానని.. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైనదని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, లోకేష్, బాలకృష్ణ పక్కన నిల్చుని రాజకీయంగా మాట్లాడాల్సిన సందర్భం వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ ఈ అవకాశాన్ని వైసీపీ, సీఎం జగనే కల్పించారంటూ పవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Pawan Kalyan visited Chandrababu's family
Pawan Kalyan visited Chandrababu’s family

40 నిమిషాలు ములాఖత్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లారు.. చంద్రబాబును కలిసేందుకు జైలు లోపలికి వెళ్లారు.. అప్పటికే క్యాంపు ఆఫీసు నుంచి అక్కడికి వచ్చిన బాలకృష్ణ, లోకేష్‌…పవన్‌ కంటే ముందే జైల్లోకి వెళ్లారు..ముగ్గురూ చంద్రబాబుతో ములాఖత్‌లో ఉన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఆ నలుగురు చర్చించారు. దాదాపు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్‌లో ఉన్నారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. చంద్రబాబును కలిసిన తర్వాత..ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై..భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. రాజమండ్రిలో పవన్ ఫ్యాన్స్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. మధురపూడి గెస్ట్‌ హౌస్‌లో ఉన్న పవన్‌ని చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు..యువకులు కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి ప్రమాదకరంగా నిల్చున్నారు. తొక్కిసలాట జరగడంతో..పవన్‌ను చూసేందుకు వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్