- Advertisement -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి తెర లేపారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు రానున్నారు.
తొలి రోజు పురూహుతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనున్న పవన్… సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో వారాహి విజయ యాత్ర పేరుతో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్…మంగళగిరి నుంచి గొల్లప్రోలు కి ప్రత్యేక హెలికాప్టర్ లో రానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు.
- Advertisement -