ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ 30 ఏళ్ల పాటు పాలన చేస్తారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు.
రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా జనసేన అధినేత కేవలం 20 సీట్లకే పరిమితం అవ్వడం శోచనీయం అన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పవన్ కళ్యాణ్ పార్టీని పెడితే తాను వెళ్లి చేరాలా అంటూ ప్రశ్నించారు.
కేవలం 20 సీట్ల కోసం పవన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటే చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గతంలో చంద్రబాబు తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేసుకున్నారు ముద్రగడ. అలాంటి చంద్రబాబుతో చేతులు కలిసిన పవన్ కళ్యాణ్ ఓటమికి తాను పనిచేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.