26.1 C
New York
Wednesday, June 19, 2024

గేమ్ చేంజర్ గా పవన్ 100 శాతం  స్ట్రైక్ రేట్…

- Advertisement -

గేమ్ చేంజర్ గా పవన్
100 శాతం  స్ట్రైక్ రేట్…
కాకినాడ, జూన్ 5, (వాయిస్ టుడే)
ఏపీ ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట తన అభ్యర్థులను గెలిపించుకొని తన స్టామినా ఎంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇంతకుముందు వైసీపీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి రాజకీయం చేసేంత నైపుణ్యం లేదు అంటూ విమర్శలైతే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తన రాజకీయ చతురతతో వార్ వన్ సైడ్ చేసేశాడు. ఇక మొత్తానికైతే వైసీపీని దారుణంగా ఓడించడమే కాకుండా కూటమిని గెలుపు పీఠాలెక్కించాడు. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించాడు. ఇక ఈ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క ఓటు కూడా చీలకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి ఈ కూటమిని ఏర్పాటు చేశాడు.నిజానికి అమిత్ షా చంద్రబాబుతో కలవడానికి అసలు ఇష్టపడలేదట.. ఎందుకంటే 2019 వ సంవత్సరంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బిజెపి ని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ పార్టీ పైన తీవ్రమైన వ్యాఖ్యలను కూడా చేశాడు. ఇక ఇంకోసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకూడదని అమిత్ షా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు ఉంటే వైసీపీ ని గద్దె దించొచ్చనే ఉద్దేశ్యంతోనే అందర్నీ కలిపి ఒక కూటమిని తయారు చేశాడు. ఇక దీనివల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చే ప్రయోజనం కంటే కూడా రాష్ట్ర ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుంది. నిజానికి ఇంతకుముందు వైసీపీ బిజెపి రెండు పొత్తులో ఉండేవి..ఇక ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వైసీపీ కి బిజెపి సపోర్టుగా ఉంటుందని పవన్ గ్రహించాడు. దీనివల్ల జగన్ కేసుల విషయంలో బిజెపి మళ్ళీ తనని ఆదుకుంటుందేమోననే ఉద్దేశ్యం తోనే పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశాడు.  జగన్ నుంచి బిజెపి పార్టీని వేరుచేసి తమ కూటమిలో కలిసిపోయేలా చేశాడు. ఇక ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులన్నింటిని బట్టబయలు చేయొచ్చు. అలాగే వీలైతే జగన్ ని మళ్లీ జైలుకు కూడా పంపించొచ్చు అనే ఉద్దేశ్యం తోనే పవన్ కళ్యాణ్ ఈ పొత్తు పెట్టుకున్నాడు.ఇక జగన్ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత  జైల్లో ఉండాల్సిందే అని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యూహా పూరితమైన రాజకీయ ప్రణాళికను రూపొందించాడనే చెప్పాలి. పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధించింది జనసేన పార్టీ. కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసింది. వంద శాతం కాకపోయినా పదిహేను సీట్లు గెలుస్తారని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే.. తీసుకున్న సీట్లలో పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు వంటి కొన్ని క్లిష్టమైన సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఈ క్రమంలో అన్ని సీట్లలో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీకి ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. కావాలనుకుంటే పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత హోదాలో ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ జనసేన పార్టీ రికార్డు సృష్టించింది. రెండు సీట్లలో పోటీ చేసి రెండు చోట్లా భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. మచిలీపట్నం, కాకినాడల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు ఎంతో ఘోరంగా అవమానించారు. ఇప్పుడు రివర్స్ అయింది. వైసీపీ నేతల కంటే పవన్ ఎంతో ఎత్తులో నిలిచారు. ఇప్పుడు వారంతా జనసేన పార్టీలో చేరేందుకు పరుగులు పెట్టుకుంటూ రావాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ గేమ్ లో తను గేమ్ చేంజర్ గా మిగిలిపోవడమే కాకుండా కొద్దిరోజుల్లోనే జగన్ కేసుల విషయాలను కూడా పరిశీలించి తనకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నాడు… ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంతో తను సక్సెస్ సాధించాడనే చెప్పాలి…

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!