- Advertisement -
పెండింగ్ ఫీజులు చెల్లించండి-కాలేజీల యజమాన్యాలు
Pay Pending Fees-Proprietaries of Colleges
హైదరాబాద్
పెండింగ్ లో ఉన్న 12వందల కోట్ల ఫీస్ రిఎంబెర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రొఫెషనల్ డిగ్రీ కోలేజస్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వన్నీ డిమాండ్ చేసింది. హైదరాబాద్, బోడ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల యాజమాన్యం పాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రావాల్సిన ఫీస్ రీఎంబెర్స్మెంట్ బకాయిలు రాక తమ టీచర్స్,సిబ్బంది యొక్క జీతాలు చెల్లించక తమ బ్రతుకులు చిన్నా విన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ఈఎంఐ రుణాలు, అద్దెలు,క్రెడిట్ కార్డుల బకాయిలు,కుటుంబ పోషణ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దీనితో టీచర్స్ విద్యార్థులపై సరైన విద్యను కూడా బోధించలేకపోతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఈ దసరా పండుగ లోపు విద్యార్థుల ఫీస్ రీఎంబెర్స్మెంట్ ను విడుదల చేయగలరని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల నుండి బయట పడి బతుకమ్మ,దసరా పండుగ మనస్ఫూర్తిగా జరుపుకునే టట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించాలని కోరారు.
- Advertisement -