న్నులు తప్పక చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించండి
Pay your dues and contribute to the development of the municipalityబద్వేలు మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహ రెడ్డి
బద్వేలు
బద్వేలు పురపాలక సంఘంలో యస్. కే.డి.నగర్,మహబూబ్ నగర్, పూసలవాడ సచివాలయాల పరిధిలో పురపాలక రెవిన్యూ అధికారుతో పాటు పన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ కమీషనర్.
పన్ను బకాయిదారులు అన్నీ రకాల పన్నులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
అక్రమ కుళాయిలన్నీ కూడా రెగ్యులర్ చేయించుకోవాలని తెలిపారు.ఇప్పటికే కొంతమంది రెగ్యులర్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్ చేయించుకోని వారి కుళాయిలు కట్ చేయాలని నీటి సరఫరా సిబ్బందిని ఆదేశించాడు.అనంతరం పూసల వాడ సచివాలయంను తనిఖీ చేసిన కమీషనర్
మూవ్మెంట్ రిజిస్టర్ ,హాజరు పట్టిక, కంప్లైంట్ రిజిస్టర్ ,కుళాయి కనెక్షన్ లు రెగ్యులరైజ్ రిజిస్టర్ ఇంటి పన్నులు వసూళ్లురిజిస్టర్,హౌసింగ్ 2.0 అప్లికేషన్స్ వంటివి తనఖీ చేయడం జరిగింది.
సిబ్బంది పనితీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది.ఎం ఎస్ ఎం ఈ సర్వే వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో కమీషనర్ తో పాటు మునిసిపల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ షఫీ,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




