Saturday, February 14, 2026

పెద్ది రిలీజ్ డేట్ మార్పు

- Advertisement -

పెద్ది రిలీజ్ డేట్ మార్పు

Peddi release date changed
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ రిలీజ్ డేట్ మార్చారు.  ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా ప్రకటించారు.వాస్తవానికి ఈ చిత్రాన్నిమార్చి 27న విడుదల చేయాలని భావించారు. పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న వస్తున్నట్టు ప్రకటించడంతో’పెద్ది’ విడుదల తేదీని వెనక్కి జరిపారు కొత్త విడుదల తేదీ మే డే వీకెండ్తో కలిసి వస్తుండటంతో సమ్మర్ సీజన్లో సినిమాకు ఇది బాగా కలిసొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ చిత్రబృందం చేసిన ప్రకటన అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విలేజ్ స్పోర్ట్స్  నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో రామ్ చరణ్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్