పంచాయితీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

- Advertisement -

పంచాయితీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

Pending salaries of panchayat workers should be paid

ఏఐటీయూసీ నాయకుల కలెక్టర్ కు విజ్ఞప్తి*
జగిత్యాల,
గ్రామపంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సంధర్భంగా
అనంతరం ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు మునుగురి హనుమంతు, ఏఐటియూసి కార్యదర్శి ఎండి ఉస్మాన్ లు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సుమారు 3 నెలలుగా వేతనాలు లేక కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేస్తూ  జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి పాత కేటగిరిలోనే  యధావిధిగా అమలు చేయాలన్నారు.
పే కమిషన్ నిర్ణయించిన మినిమం బేసిక్ ప్రకారం 19వేలు వేతనంగా చెల్లించాలని, అలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్లీపర్లకు రూపాయలు 15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు,  కారోబార్, బిల్ కలెక్టర్లకు  19,500 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్, వారాంతపు, పండుగ, జాతీయ ఆర్థిక సెలవులు మంజూరు చేయాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా గ్రామపంచాయతీ అవసర ప్రాతిపదికన కార్మికులను నియమించు కోవాలన్నారు.
ట్రాక్టర్ డ్రైవర్ల అందరికీ పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించాలని, సంవత్సరానికి 3 జతలు యూనిఫాం, సరిపడా చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలన్నారు.
కరోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలుగా నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెన్న మహేష్, గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్షులు బిట్కు రాములు, మోతి మహేష్, సతీష్, తిరుపతి, గంగు, నర్సు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular