జనవరి 20 లోగా పెండింగ్ ఉపకార వేతన దరఖాస్తు ఫారాలు అందించాలి…
Pending scholarship application forms should be submitted by January 20...
జిల్లా బి.సి. అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి
ఖమ్మం:
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలోనీ ప్రభుత్వ, ప్రైవేటు, యూనివర్సిటీ ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు 2017-18 నుండి 2023-24 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను జనవరి 20లోగా అందజేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి తెలిపారు.
కలెక్టరేట్ లో రెండవ అంతస్తులో ఉన్న జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులను అందజేయాలని, ట్యూషన్ ఫీజులకు సంబంధించి చాలా అప్లికేషన్లు నో-ఫీజు అని ఈ-పాస్ వెబ్ సైట్లో చూపించడం జరుగుచున్నదనీ, కళాశాలల యాజమాన్యం వారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో, పియంయు సెంటర్ లో సంప్రదించి ఫీ-స్ట్రక్చర్ ను ఈ-పాస్ వెబ్ సైట్లో అప్డేట్ చేయించు కోవాలని, ఫీజు స్ట్రక్చర్ ను అప్డేట్ చేయని కళాశాలలకు ట్యూషన్ ఫీజు రాకపోతే సంబంధిత కళాశాలల యాజమాన్యం వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అట్టి వారిపై శాఖాపరమైన చర్యల కోసం పై అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని జి. జ్యోతి ఆ తెలిపారు.