- Advertisement -
రిటైర్డ్ పోలీస్ అధికారులు నిర్వహించిన పెన్షనర్స్ డే
Pensioner's Day organized by Retired Police Officers
పాల్గొన్న పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి
కరీంనగర్
కరీంనగర్ విద్యానగర్ లోని ఓ ఫంక్షన్ హాలు లో మంగళవారం నాడు రిటైర్డ్ పోలీస్ అధికారులు నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమీషనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు పూల మొక్కలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులంతా దాదాపు 35 నుండి 40 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో సేవలందిచారన్నారు. వారి సేవలు ఎంతో గొప్పవన్నారు. ఎన్నో సంఘ విద్రోహ శక్తులకు ఎదురొడ్డి పోరాడటం వల్లే ఈ రోజు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. కొంతమంది అధికారులైతే విధినిర్వహణలో ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. వారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం అన్నారు. ఇటీవల మరణించిన రిటైర్డ్ అధికారుల కొరకు రెండు నిమిషాల మౌనం పాటించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల అసోసియేషన్ లో చేరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 40 మంది అధికారులను పోలీస్ కమీషనర్ పూల మాల వేసి శాలువాతో సత్కరించారు. నూతనంగా పోలీస్ శాఖలో చేరిన అధికారులకు రిటైర్డ్ పోలీస్ అధికారుల సేవలు ఆదర్శమన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ కమీషనర్ దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ , టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రిటైర్డ్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, రాజమౌళి, ముంతుజా, మల్లయ్య, లింగయ్య ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -