- Advertisement -
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు భయపడే పరిస్థితి
People are afraid of Congress government
* ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు చూసి భయపడే పరిస్థితి
* మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి ప్రతినిధి :
ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలు చూసి భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సంబంధించిన దాదాపు లక్షమంది రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడం తో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ని కలిసి జిల్లా రైతుల ఆవేదనను వ్యక్తం చేసి, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని వినతి పత్రాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దాదాపు పెద్దపల్లి జిల్లా మొత్తం మీద రుణమాఫీ కావలసిన రైతుల సంఖ్య 1 లక్ష 52 వేల 184 ఉండగా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 51,393 మంది రైతులకు మాత్రమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సమావేశంలో రాష్ట్రంలో మొత్తం మంది రైతులకు రుణమాఫీ జరిగిపోయిందనీ, మా ప్రభుత్వం గొప్పగా చేసినమని స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పై ఇప్పుడు లెక్కకు లేని ఆంక్షలు పెడుతోందని అన్నారు. ఇది ఈ పెద్దపల్లి జిల్లా కు సంబంధించిన విషయం కాదనీ, రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది 49 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చిండ్రు రుణమాఫీ 23 లక్షల 25 వేల మంది ఇచ్చిండని, మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తోన్న ఒక్క స్కీం అయిన సరిగా అమలు జరగడం లేదనీ గుర్తు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు ఇచ్చే రూ.2500, ముసలవ్వలకు ఇచ్చే రూ.4 వేలు, రూ.500 రూపాయల బోనస్, కళ్యాణ లక్ష్మీ తులం బంగారం, ఇవన్నీ ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు. అన్ని మాయ మాటలు, దొంగ మాటలు, దగుల్బాజీ మాటలు మాట్లాడుతూ ఒక వైపు హైడ్రా పేరు మీద హైదరాబాద్ లోని భవనాలనుకోల్సివేయడం దయానంగా మారిందన్నారు. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి నువ్వే చెప్పావు కదా ఒక నిర్మాణాన్ని కూలగొట్టే ముందు దానికి చట్టాలు ఉన్నాయనీ, ఒకవేల రెగ్యులరైజ్ చేయాలనుకుంటే కూడా చేయవచ్చని చెప్పావు కదా అని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు. ఇప్పుడు వేరే దేశం ఇంకో దేశం పై దాడి చేసినట్లు దొంగల్లాగా తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో హైడ్రా పేరు తో ఇండ్లను కూల కొడుతున్నావు ఇదో నీకు న్యాయమా..? నీ తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డారని, లక్షల మంది ఆవేదనలు వినపడటం లేదా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇలాంటి పరిస్థితి ఉందా అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23 సార్లు డిల్లీ పోయచ్చిండ్రు ఈరోజు కూడా డిల్లీ లోనే ఉన్నాడు ఏం సాందించిండో తెలియదు.. కానీ కెసిఆర్ చెప్పిండ్రు మోసపోతే గోస పడతరని, కాని ఎవరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మి ఓటు వేస్తిరన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన నడుస్తోందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో రెసిడెన్షియల్ హాస్టల్లు నాష్టమైపోయాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అందాకారం అయిపోయిందన్నారు.
ఆసుపత్రి పోతే మందులు లేవు కెసిఆర్ పాలనలో ప్రసవాలు 80 శాతం ప్రభుత్వం ఆసుపత్రిలో జరిగాయి.. ఈరోజు 33 శాతానికి తగ్గిపోయాయని అన్నారు. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనా కొనసాగుతున్నది. దీనికి చరమగీతం పాడాలంటే తప్పకుండా రైతు లోకమంతా ఏకం కావాలన్నారు. ఇది బిఆర్ఎస్ పార్టీ సమస్య కాదు. ఇది లక్షల మంది రైతుల సమస్య ఈ రాష్ట్రలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్య కాబట్టి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేడుకగా ఇది అంతం కాదు ఆరంభం అని కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి ని హెచ్చరించారు. రైతు ఏడ్చినా రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడలేదు. ఈ రాష్ట్రంలో రైతులను ఏడిపిస్తున్నావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పాపకారి ప్రభుత్వం అని ప్రజలకు తెలిసిపోయిందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ , పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాజీ జెడ్పిటిసి గంట రాములు, నాయకులు దాసరి ఉష, మార్కు లక్ష్మణ్, మాజీ ఎంపీపీలు నునేటి సంపత్, బాలాజీ రావు, నాయకులు బండారి శ్రీనివాస్, అన్ని మండలాల మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ రైతుబంధు కన్వీనర్లు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రైతు సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -