కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు
పెద్దపల్లి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నీ ఆగినయి. నీళ్ళు లేక కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పొలాలు మొత్తం ఎండిపోయాయమని పెద్దపల్లి బీ ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గతేడాది ఈ మండలంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ 120 రోజుల పాలనలో ప్రజలు విసుగు చెందారు. మళ్ళీ బీ ఆర్ ఎస్ రావాలని ప్రతి గ్రామగ్రామాన కోరుకుంటున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు స్థానికులు కారు. జూలపల్లి మండలం కుమ్మరి కుంటలో నేను పుట్టాను. బిజెపి కాంగ్రెస్ అభ్యర్థులది పెద్దపల్లి కాదు హైదారాబాద్. వేల కోట్లున్న వివేక్ కుటుంబం పెద్దపల్లి కి చేసింది ఏమి లేదు . వేల కొట్లున్న వివేక్ ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ పెట్టారా. వీకెండ్ నాయకులకు ఓటు వేయవద్దని అన్నారు.
కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు
- Advertisement -
- Advertisement -