వాయిస్ టుడే న్యూస్ పటాన్ చెరు: పేదల భూములను అన్యాక్రాంతం చేస్తూ.. అధికార దర్పంతో విర్రవీగుతున్న బిఆర్ఎస్ ను గద్దెదించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని పటాన్ చెరు బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి టి.నందీశ్వర్ గౌడ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పటాన్ చెరు మండలం పోచారం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి పటాన్ చెరు బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి టి.నందీశ్వర్ గౌడ్ శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడిన స్వయంగా ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటను బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తో కలిసి రాహుల్ సిప్లిగంజ్ బిజేపి నాయకులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న అవినీతికి అడ్డూఅదుపులేదని, పేదల భూములను కొల్లగొట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తమకు అవకాశం కల్పిస్తే మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైలు విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట అందరినీ అలరించింది.



