ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు
పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి : చంద్రబాబు
అమరావతి ఏప్రిల్ 1
People first.. and then other things
Pensions should be given with respect: Chandrababu
ప్రజా సేవల పేరుతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని కోరారు. ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు అని అన్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. గతంలో బటన్లు నొక్కామని.. ప్రజల బటన్లు అన్నీ తన పెన్షన్ తో సమానమని చెప్పారు. ముందుండి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నానని తెలియజేశారు.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో మనకంటే తక్కువ పెన్షన్ అందిస్తుందని పేర్కొన్నారు. మళ్లీ అమరావతిని గాడిన పెట్టామని, పనులు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు