మంత్రి నివాసం నందు ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజలు
People flocked to the public darbar at the minister's residence
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు
బద్వేలు
రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. రాయచోటి నియోజకవర్గం లో నీటి సమస్య అధికంగా ఉందని నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
గతంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక ఎన్నో కష్టాలు, ఎదుర్కొనే వారిని నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉదయం 6 గంటలకే ప్రజలు అర్జీలు చేత పట్టుకొని మంత్రి నివాసం నందు బారులు తీరారు.
ఈ సందర్భంగా ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని మంత్రివర్యులు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.