ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీని ప్రజలు సాగనంపారు
People hated the YCP for murdering democracy :
-రామన్నగూడెం ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని తన ఇష్టారాజ్యంగా ఖూనీ చేసి గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నగూడెంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లాడారు. ల్యాండ్, శాండు, మైను, వైను అని తేడా లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన జగన్ సిగ్గు లేకుండా నెల రోజులకే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆ విమర్శల్లో జగన్ విశ్వసనీయత తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా పాలన ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అడ్డదిడ్డంగా దోచుకున్న కొట్టును తాడేపల్లిగూడెం నియోజకవర్గం చరిత్రలో ఈ ప్రత్యర్థి చవిచూడని భారీ ఓటమిని రుచి చూపించిన ఘనత నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందన్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతానన్నారు. గత టిడిపి హయాంలో తాడేపల్లిగూడెం మండలాన్ని అభివృద్ధి చేసిన మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల మల్లికార్జున రావు (బాబ్జి)బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట బీమా శంకర్ రావు ( తాతాజీ) సహకారంతో ప్రజల అభీష్టం నెరవేరుస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామములో సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు హాజరయ్యారు.