టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు. కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారు. డీజీపీ అంజనీ కుమార్ ను, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పాం. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మేం చెబుతుంటే.. బీఆరెస్ మాపై విష ప్రచారానికి దిగింది. సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా విడుదల చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుంది. కాంగ్రెస్ ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేసినా….బీఆరెస్ ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరు. మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను బయటపెట్టడం లేదు. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటని ప్రశ్నించారు.
కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చింది. హరీష్ కేటీఆర్ బిల్లా రంగా లాంటివారు. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారు. వాళ్ళేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లని రేవంత్ ఆరో్పించారు. ..