Wednesday, January 21, 2026

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ అక్టోబర్ 17, 2025న రిలీజ్

- Advertisement -

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ అక్టోబర్ 17, 2025న రిలీజ్

People Media Factory's 'Telusu Kada' to release on October 17, 2025

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ , టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17, 2025న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రీ దీపావళి ధమాకాతో దీపావళి మరింత సందడిగా మారబోతోంది. ఈ చిత్రం హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించబోతోంది.
రిలీజ్ డేట్ పోస్టర్ విజువల్ ఫీస్ట్ లా వుంది. ప్రేక్షకులను తెలుసు కదా వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. అనౌన్స్ మెంట్ వీడియో కూడా ఆసక్తికరంగా వుంది. హీరో ఇద్దరు హీరోయిన్స్ మధ్య చిక్కుకునే కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేస్తోంది.
దర్శకురాలు నీరజ కోన తన మొదటి చిత్రంతో తెలుగు సినిమాకు ఒక కొత్త వాయిస్ ని అందిస్తున్నారు. ఇది మనసుని తాకేలా, ఊహించని మలుపులతో నిండిన కథగా వుండబోతోంది. న్యూ జనరేషన్ నిర్మాత కృతి ప్రసాద్ ఈ చిత్రం కథా చర్చల నుంచే డైరెక్టర్ తో దగ్గరగా కలిసి పనిచేశారు. స్క్రిప్ట్ నుండి మౌంటింగ్, ఎగ్జిక్యూషన్ దాకా ప్రతి దశలో కొలాబరేట్ అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ తన సిగ్నేచర్ స్క్రీన్ ప్రజెన్స్, ఎనర్జీతో న్యూ ఏజ్ హీరోగా, ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా, జీవంతో నిండిన పాత్రలో ఆకట్టుకోనున్నారు.
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ బాబా నిర్వహిస్తున్నారు, స్టార్ కంపోజర్  థమన్ ఎస్. సంగీతం సమకూర్చారు.  నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్‌.  అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా,  శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్