ఉచిత ఫిజియో థెరపీ సేవా కేంద్రంను ప్రజలు వినియోగించుకోవాలి
People should avail the free physiotherapy service center
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి ప్రతినిధి
:
జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వయోవృద్ధుల ఫిజియో థెరపీ సేవా కేంద్రం ను అవసరమైన ప్రజలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి తనీఖీలో భాగంగా ఉచిత వయోవృద్ధుల ఫిజియో థెరపీ సేవా కేంద్రం ను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆపరేషన్ జరిగిన వారికి, నడుం నొప్పి, మెడ నొప్పి, దీర్ఘకాలిక నొప్పులు బారిన పడిన వారు, పక్షవాతం, వెన్న పూస సమస్యలు, డిస్క్ సమస్యలు ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల ఫిజియో థెరపీ సేవా కేంద్రం ను ఉపయోగించుకోవాలని అన్నారు. ఫిజియోథెరపీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని అవసరమైన వారు తప్పనిసరిగా వినియోగించు కోవాలని అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు వృధా చేసుకోవద్దని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట ఆర్.ఎం.ఓ రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.