శ్రీ లోకమాత తల్లి పోచమ్మ ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల,
శ్రీ లోకమాత తల్లి పోచమ్మ ఆశీస్సులతో జగిత్యాల జిల్లా ప్రజలు అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతలతో సుభిక్షంగా ఉండాలని, జగిత్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందాలని
ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేడుకున్నారు.
మంగళవారం శ్రీ లోకమాత పోచమ్మ దేవాలయానికి ఆయన సందర్శించారు.. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రభుత్వ విప్
లక్ష్మణ్ కుమార్ ను
పూర్ణ కుంభముతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వేద మంత్రములతో ఆశీర్వదించారు..ఈ సందర్భముగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే, శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దయతో జగిత్యాల జిల్లా ప్రజలు అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషములతో సుభిక్షంగా ఉండాలని, జగిత్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, రాష్ట్ర నాయకులు బండ శంకర్, వర్తక సంఘం అధ్యక్షులు కమటల శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు గాజుల రాజేందర్, కౌన్సిలర్ ములస్తం లలిత మునిందర్,ఆలయ నిర్వాహకులు మల్లికార్జున్, గంగాధర్, ఐలా చంద్ర ప్రకాష్, రేపల్లె హరికృష్ణ, గాజోజు రాజ గోపాల చారి, రాఘవ చారి, నాగామల్ల మనోహర్, తుమ్మనపెల్లి సుగుణకర్, ఆలయ పూజారి చరణ్ తదితరులు పాల్గొన్నారు.