- Advertisement -
మిస్సింగ్ సిటిజన్ రికార్డ్స్ సర్వేకు ప్రజలు సహకరించాలి…తహసిల్దార్ రమాదేవి
People should cooperate in Missing Citizen Records Survey...Tehsildar Ramadevi
తుగ్గలి
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తున్న మిస్సింగ్ సిటిజన్ రికార్డ్స్ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని తుగ్గలి తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఆధార్ కార్డ్,జాబ్ కార్డ్, రైస్ కార్డ్,అంగన్వాడీ రికార్డ్స్,ఎలక్ట్రిసిటీ బిల్ రికార్డ్స్,స్కూల్ రికార్డ్స్ ఆధారంగా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఆమె తెలియజేశారు. ప్రజలకు వచ్చే ఓటీపీ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని ఆమె తెలియజేశారు.హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోని ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించవని ఆమె తెలియజేశారు. కావున ప్రజలు అధికారులకు సహకరించి ఓటీపీ లను తెలియజేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని ఆమె తెలియజేశారు.
- Advertisement -