- Advertisement -
సర్వేలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి.
People should participate in the survey voluntarily.
వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు వెల్లడి
వరంగల్
వచ్చేనెల రెండు నుంచి జరిగే జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సర్వేలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని వరంగల్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ బి సాంబశివరావు అన్నారు. గురువారం వరంగల్ డిఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నోడల్ సూపర్వైజర్లు, ఆశా సిబ్బందికి జరిగిన లేప్రసి అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరంగల్ జిల్లాలో డిసెంబర్ 2 నుండి 15 వరకు ఉదయము 6 గంటల నుండి 9 గంటల వరకు ఇంటింటి సర్వే ఆశా కార్యకర్తలు ,ఆరోగ్య కార్యకర్తలు ,ఆరోగ్య సిబ్బంది ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు .ప్రజలు స్వచ్ఛందంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సహకరించి ఒంటిపైన పాలిపోయిన , రాగి రంగులో, స్పర్శ జ్ఞానం లేని మచ్చలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి సూపించాలని, చెవి వెనక, ముంజేతులు, కాళ్లు ఉపరితల నరుములు, చెవివేలుపల నూనె రాసినట్లు బొడిపెలు ఉన్నచో, పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారి సలహా మేరకు తగిన చికిత్సలు తీసుకోవాలని కోరారు. కుష్టి వ్యాధి పెద్ద రోగం కాదని మనం చేసిన పాపాల వల్ల వచ్చిందని గాని, శాపం వల్ల వచ్చిందని అని భావించవద్దన్నారు. కుష్టి వ్యాధి మైకోబాక్టీరియం లెఫ్ట్రి అనే బ్యాక్టీరియా వలన వస్తుందని ఇది అన్ని రోగములవలనే నయమవుతుందని తెలిపినారు. కుష్టి వ్యాధితో బాధపడుతూ అంగవైకల్యం కలిగిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలతో సరిచేసి నయం చేయవచ్చునని, ప్రజలంతా సహకరించి తమ వ్యాధులకు తగిన చికిత్సలు చేయించుకోవాలని కోరారు . శిక్షణానంతరం సర్వేకు సంబంధించిన ఐఇసి మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ మోహన్ సింగ్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ నరసింహారెడ్డి, డిపిఎం ఓ లు వెంకన్న ,అనుపమ రెడ్డి, డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నోడల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -