Wednesday, April 16, 2025

ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..

- Advertisement -

ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..

People should take advantage of government medical services.

సీఎం సహాయ నిధి నిరుపేదలకు ఆసరా నిలుస్తోంది..

208 మంది లబ్ధిదారులకు రు.59,18,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ..

ఆరోగ్య శ్రీ లో రు.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం..

రతన్ టాటా సేవా దృక్పథం ఆదర్శనీయం..

రతన్ టాటా కు భారత రత్న ఇవ్వాలి..

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల,
విద్య,వైద్యం పొందడం పౌరుల హక్కు అని, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ పట్టభధ్రల
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి..
అన్నారు.శుక్రవారం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో శుక్రవారం జగిత్యాల నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 208 మంది లబ్ధిదారులకు
సీఎం సహాయ నిధి కింద మంజూరైన
రు.59,18,000 విలువైన చెక్కులు
లబ్ధిదారులకు ఎమ్మెల్సీ లబ్ది దారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
నిరుపేదలకు అండగా నిలిచేందుకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందన్నారు.
విద్య, వైద్యం పొందడం పౌరుల హక్కు అని,సీఎం రేవంత్ రెడ్డీ ఆరోగ్య శ్రీలో ఉచితంగా అందించే వైద్య సదుపాయాల పరిమితి రు. 5 లక్షల నుండి రు.10 లక్షలకు పెంచారని అని ప్రజల దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు ఆర్థిక భారం కాకూడదని ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచిత వైద్య సేవలను వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు అని గుర్తు చేశారు.
ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందే అవకాశం లేనప్పుడు మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు.నిరుపేదలకు సీఎం సహాయ నిధి  ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోందన్నారు.ఆరోగ్యశ్రీ లో ఉచిత వైద్య సదుపాయం పొందడం ప్రజల హక్కు గా భావించాలని,
ఆరోగ్య శ్రీ లో అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య సదుపాయం అందుబాటులోకి ఉందని అన్నారు.
నిరుపేదలకు అవగాహన లేక ఆరోగ్య శ్రీ లో ఉచిత వైద్య సేవల సదుపాయం ఉన్నప్పటికీ
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని, దీంతో ఆర్థికంగా చితికి పోతున్నారని అన్నారు.ప్రభుత్వ పరంగా అందుబాటు లో ఉన్న వైద్య సదుపాయం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
నిమ్స్ లో వైద్య ఖర్చులకు ఎల్ఓసీ పొందే అవకాశం ఉందని,నిమ్స్ లో అన్ని విభాగాల్లో  వైద్య సదుపాయం ఆధునిక సౌకర్యాలు ఉన్నాయిన్నారు.
క్యాన్సర్ కు సంబందించి అత్యంత ఆధునిక సదుపాయం సైతం అందుబాటు లో ఉందని తెలిపారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా చిత్రపటానికి పూలమలలు వేసి  నివాళులు అర్పించారు.
టాటా ఏయిర్ లైన్స్ ఏర్పాటు చేస్తే నెహ్రూ  ప్రభుత్వ పరంగా చేశారని  గుర్తు చేశారు.
భారత దేశ అభివృద్ధిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు.తన వ్యాపారాల్లో వచ్చిన లాభాల్లో
సగానికి పైగా ఇతరులకు సాయం చేయాలని దానం చేశారు.
తన సేవాగుణంతో ప్రజల మన్ననలు పొందారని,రతన్ టాటా కు భారత రత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు .
గత ప్రభుత్వం కులాల పేరిట, వర్గాల వారీగా విడదీసి..రెసిడెన్షియల్ స్కూల్స్  ఏర్పాటు చేసి, అద్దె భవనాల్లో కొనసాగించారన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతి నియోజక వర్గంలో అన్నివర్గాల విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తుండడం అభినందనీయం అన్నారు.జగిత్యాల లో సమగ్ర రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని సీఎం కు విజ్ఞప్తి చేసినం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
పాండవులు అజ్ఞాత వాసం ముగించుకొని శమి వృక్షానికి పూజలు చేసి విజయం సాధించారు.
పాండవుల కౌరవుల మధ్య ప్రత్యక్ష యుద్ధం లో విజయం సాధించినందుకు గుర్తుగా విజయ దశమి నిర్వహించుకుంటున్నామన్నారు.
విజయ దశమి అందరికీ విజయం చేకూర్చాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్