
బిజెపి ఎంపి డా. లక్ష్మణ్
హైదరాబాద్
మోది నీ మూడో సరి ప్రధాని చేయడానికి మద్దతుగా ఈ విజయ సంకల్ప యాత్ర చేపట్టామని బీజేపీ ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.బుధవారం అయన చార్మినార్ లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు జరిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రం లోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో యాత్ర పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడికి చేరుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బిజెపి ఊహా రచన చేస్తుంది. ఎంఐఎం కంచుకోటగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి బిజెపి కైవసం చేసుకుంటుంది. కేవలం బడా వ్యాపారులకు కొమ్ము కాస్తూ.. పేద ప్రజలను పట్టించుకోని ఎంఐఎం కి ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.
కాంగ్రెస్ కూడా హామీల అమలు విషయంలో మాట మారుస్తుంది. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య అన్నట్లు ఉంది కాంగ్రెస్ ది. మొదటగా అందరికీ ఆరు గ్యారెంటీ లు అని చెప్పి.. ఇప్పుడేమో కండీషన్లు అంటుతుంది. ఎన్నికల ముందు అందరికీ 500 వందల గ్యాస్ సిలిండర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి., ఇప్పుడు కొంత మందికి మాత్రమే అని కండిషన్స్ చెబుతున్నారు. మన రాష్ట్రం లో తెలంగాణ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే సిలిండర్ ఇస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ పథకాలు ప్రారంభిస్తున్నారు.. ఎన్నికల తరువాత అమలు చేస్తారనే నమ్మకం లేదు. ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ కి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
సరిపడా బస్సులు లేకుండా చేసి పధకం అమలు చేస్తున్నాం అని చెబుతున్నారు. డిల్లీ కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ కాంగ్రెస్ ఏటిఎం గా మారుతుంది. తెలంగాణ సంపద తో డిల్లీ కాంగ్రెస్ కి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వనుందని అన్నారు. పేద ముస్లింలు అభివృద్ధి చెందకుండా ఓల్డ్ సిటీ కి మెట్రో రాకుండా ఎంఐఎం చేయింది. రోడ్లు కూడా విస్తరించకుండా చేస్తుంది కూడా ఓవైసీ నే. ఏ ప్రభుత్వం అధికారం లోకి వస్తే వారి పక్కన చేరడం ఓవైసీ ల పని. వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చేతులు కలుపుతారని అన్నారు.
కర్ణాటకలో నాసిర్ షా ఎమ్మెల్సీ గా గెలిచిన తరువాత పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. పాకిస్థాన్ జిందాబాద్ అనే స్థాయి కి దిగజారింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలి. దేశం కోసం పనిచేసే బిజెపి కి ఈ సారి ఓటు వేసి గెలిపించండి. ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇచ్చి చూడండి హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తామో తెలుస్తుందని అన్నారు.