ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో నిర్వహించాలి…
వరద సమస్యను పరిష్కరించిన డీఎల్పిఓ…
అభినందించిన గ్రామస్తులు…
People’s problems should be handled with sincerity…
కొత్తగూడెం ,
: అధికారులు ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో నిర్వహించాలని డిఎల్పీ ఓ సుధీర్ అన్నారు . మంగళవారం దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక గ్రామంలో సుమారు 6, 7 సంవత్సరాల నుండి అపరిష్కృతంగా డ్రైనేజీ, వర్షపు నీటి సమస్య ఉన్నదని ఆయనకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్నారు. గత నెల రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూరుబాక గ్రామంలో ప్రతి ఇంటి ముందు వరద నీరు నిలబడి ఇంట్లోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అనంతరం వర్షపు నీరు నిలువ ఉన్న ప్రాంతాలను గుర్తించి జెసిబి ద్వారా పెద్ద కాలవను తవ్విo చారు. సమస్యపై సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ అధికారులు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు.


