విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తూ, పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
– జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి . ఉదయ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు.
చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు పరిశీలించడంతోపాటు క్యూస్షన్ పేపర్ సీల్ ఓపెనింగ్ క్లోజింగ్,
సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చీఫ్ సూపరింటెండెంట్‌తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి లోనికి అనుమతించాలని, సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. లోటుపాట్లు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని, విద్యార్థులకు పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
మంగళవారం రెండో రోజు ద్వితీయ భాష హిందీ పరీక్షకు 10,524 మంది విద్యార్థులకు గాను 10,505 మంది విద్యార్థులు నేటి పరీక్షకు హాజరుకాగా 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, డిఇఓ తెలిపారు.
బిజినపల్లి బాలికల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా పరీక్షల అబ్సర్వర్ రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ, మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఒక విద్యార్థిని డిబార్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ కు షోకేస్ నోటీస్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు.