శిక్షణ పర్యవేక్షణ నోడల్ అధికారి నర్సింగ్ రావు
నాగర్ కర్నూల్ నవంబర్ 09: శాసనసభ ఎన్నికల సందర్భంగా దినపత్రికలు, ప్రసార చానల్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పెయిడ్ న్యూస్,పెయిడ్ ఆర్టికల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని ఎన్నికల శిక్షణ పర్యవేక్షణ నోడల్ అధికారి నర్సింగ్ రావు యం సి, యం సి కమిటీ కి సూచించారు. గురువారం కలెక్టరేట్ లో ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంసీఎంసీ కమిటీ సభ్యులకు ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ అమలుపరచాల్సిన అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ చానల్స్, స్థానికంగా వచ్చే కేబుల్స్ చానల్స్ లో వచ్చే ప్రసారాలను అన్నింటిని రికార్డింగ్ చేయడం అదేవిదంగా పెయిడ్ న్యూస్, పెయిడ్ ఆర్టికల్స్ క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి వాటికి అనుగుణంగా విధించిన ధరల పట్టిక ఆధారంగా అభ్యర్థుల వ్యయ సమాచారాలను ఎప్పటికప్పుడు వ్యయ నోడల అధికారులకు అందజేయాలని కోరారు.
సామాజిక మాధ్యమాలు ఇతర మాధ్యమాల్లో అభ్యర్థులు రోజువారీ ప్రచార ప్రకటనలను ముందస్తు అనుమతి తీసుకునేలా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా రాజకీయ పార్టీల అభ్యర్థులకు తెలియజేయాలని కోరారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఏ రకమైన మధ్యమాలతో ప్రచారాలు నిర్వహించే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ప్రకటన అనుమతి కోసం ఎం సి ఎం సి ద్వారా అనుమతి పత్రం తప్పనిసరి తీసుకోవాలన్నారు. సినిమా థియేటర్లు ప్రకటనలు, ఒకేసారి ఎక్కువమందికి చేరేలా (సమూహ సందేశాలు) బల్క్ ఎస్ఎంఎస్ లు, (స్వర సందేశాలు) వాయిస్ ఎస్ఎంఎస్ లపై కూడా అనుమతి తప్పనిసరి అన్నారు. జిల్లాలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ కమిటీ నిర్వహించాల్సిన బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన మాస్టర్ ట్రైనర్ చంద్రశేఖర్
ఈ సమావేశంలో ఏపీఆర్ఓ తిరుపతయ్య, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు కౌశల్ కిషోర్ పాండే, శ్రీధర్, దినకర్ రావు, లక్ష్మణ్, యం.డిపాషా, సోషల్ మీడియా పర్యవేక్షణ నిష్ణార్థులు హర్షత్, శ్రీకర్ యాదవ్, గురుబ్రహ్మేంద్ర దీక్షిత్, శ్రీను అనసూయ కల్పన తదితరులు పాల్గొన్నారు.



