చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద ని సన్మానించిన పేట భాస్కర్
కోరుట్ల
కోరుట్ల నియోజకవర్గ కేంద్రానికి తొలిసారిగా వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద ని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ,అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పేట భాస్కర్ ఘనంగా సన్మానించారు.
శనివారం కోరుట్ల పట్టణం లో జరిగిన దివంగత మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు ఫోన్ నెంబర్ ను నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఆవిష్కరణ కు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కోరుట్ల నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు,కృష్ణ రావులతో కలిసి మొదటగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సన్మానించిన పేట భాస్కర్ పలు అంశాలతో పాటు గత ప్రభుత్వం లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్దిదారులకు నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే వివేక్ ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం నాయకులు షాహిద్ మహ్మద్ షేక్, బలవంతుల సురేష్, ఇంద్రాల హరీష్, మాజీ సర్పంచ్ బొల్లే నర్సయ్య, శనిగారపు రాజేష్,జాగర్ల రాజయ్య, సందీప్,మధు తదితరులు పాల్గొన్నారు.



