- Advertisement -
హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Phone tapping case against Harish Rao
హైదరాబాద్, డిసెంబర్ 3, (వాయిస్ టుడే)
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువు అధికారులను విచారించి అరెస్టు చేశారు. లీడర్లకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పారు. ఈ మధ్య ఒకరిద్దర్ని విచారించారు. ఇంతలో మరో సంచలన నమోదు అయింది. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీష్‌రావుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. ఫోన్ ట్యాప్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు, మాజీ డిసిపి రాధా కిషన్‌రావు కలిసి తన ఫోన్ ట్యాపప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(B), 386, 409 ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు రిజిస్టర్ చేశారు.
- Advertisement -