Sunday, January 25, 2026

రేవంత్ ట్రాప్ లో  గులాబీ దళం

- Advertisement -

రేవంత్ ట్రాప్ లో  గులాబీ దళం

Pink army in Revanth trap

హైదరాబాద్, సెప్టెంబర్ 16
ప్రజా సమస్యల నంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి తరచూ ఓ అంశాన్ని హైలెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి అలాంటి ప్లాన్లు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉంటే.. ఏం చేయాలి ?. ఆ ట్రాప్‌లో పడకుండా ప్రజా సమస్యలనే  హైలెట్ చేయాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఆ ట్రాప్‌లో పడి వెళ్లిపోతోంది. మళ్లీ రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు  చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దానికి సాక్ష్యం..  కౌశిక్ రెడ్డి – అరికెపూడి గాంధీ వ్యవహారమే. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా విపక్ష నేతను నియమించడం సంప్రదాయం. ఆ ప్రకారం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కు ఇవ్వాలని దరఖాస్తు వెళ్లింది. అయితే స్పీకర్ మాత్రం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇచ్చారు. ఆయన పార్టీ మారిపోయారని  బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మారలేదని ఆయన అంటున్నారు. నిజానికి సాంకేతికంగా ఆయన పార్టీ మారకపోయినా బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అనధికారికంగా అయినా తమ పార్టీకి అనుబంధం ఉన్న ఎమ్మెల్యేకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్. అధికారికంగా మాత్రం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అక్కడ నిబంధనల ఉల్లంఘన జరగలేదు. కానీ దీన్ని హ్యాండిల్ చేయడంలో బీఆర్ఎస్ చూపించిన  దూకుడుతో రేవంత్ రాజకీయం చేశారు. అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడంపై కౌశిక్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. దూకుడైన.. వివాదాస్పద  రాజకీయాలు చేస్తున్న కౌశిక్ రెడ్డి మాట కంటే ముందు ఇతర నేతల ఇళ్లపైకి వెళ్తానని బయలుదేరుతున్నారు. కౌశిక్ రెడ్డి దూకుడును కాంగ్రెస్ పక్కాగా ఉపయోగించుకుంది. ఆయనను మరితంగా రెచ్చగొట్టింది. ఇలాంటి సమయంలోనూ సంయమనం పాటించాల్సిన బీఆర్ఎస్ నేతలు.. మరింత దూకుడుగా వెళ్లి కాంగ్రెస్ పని సులభం చేశారు. ఈ పరిణామాలతో  సెటిలర్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం అయినట్లయింది. అలాగే శాంతిభద్రతల సమస్యను తీసుకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించడం ద్వారా రేవంత్  రెడ్డి మరో కోణాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇవన్నీ ఆలోచిస్తే.. చాలా డ్యామేజ్ జరుగుతుదంని తెలిసి..బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. గాంధీ కన్నా రేవంత్ నే టార్గెట్ చేస్తూ తర్వాత విమర్శలు చేశారు. కానీ అప్పటికే జరాగల్సిన నష్టం జరిగిపోయిందన్న వాదన ఉంది. రేవంత్ రెడ్డి పాలన చేపట్టిన మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావొచ్చు.. హైడ్రా విషయంలో కావొచ్చు.. రుణమాఫీ విషయంలో కావొచ్చు.. బీఆర్ఎస్ ఆవేశపడేలా చేసి.. తన రాజకీయం తాను చేస్తున్నారు. వీటన్నింటిపై బీఆర్ఎస్‌కు అవగాహన ఉంది. రేవంత్ అలా చేస్తున్నారని అంటున్నారు కానీ.. తమను తాము కంట్రోల్ చేసుకోలేక ట్రాప్ లో పడిపోతున్నారు. అందుకే  బీఆర్ఎస్ కు ప్రతీ సారి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. ఈ ఘటనలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ కోరుకున్నది కూడా అదే. బీఆర్ఎస్ చేసింది కూడా అదే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్