- Advertisement -
హైదరాబాద్ గాంధీ భవన్ లో గులాబీ కారు హాల్ చల్ చేసింది. బై బై కెసీఆర్ అంటూ పోస్టర్లను దానికి అతికించి గాంధీ భవన్ ఎదుట ప్రదర్శనకు ఉంచారు. అహంకారంపై తిరగబడదాం, తెలంగాణను రూ. 3 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలను ముంచిండు, మాకిచ్చే పథకాల్లో 30% కమిషన్లు మింగుతుంటివి అని రాసిన పోస్టర్లను అతికించారు. కెసిఆర్ సర్కార్ వైఫల్యాలు. అవినీతి పనులపై వివరించారు. కాంగ్రెస్ శ్రేణులు కారును పోటోలు తీసి షేర్ చేస్తున్నారు.
- Advertisement -