కొత్తగూడెంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం
Pink flag is sure to fly in Kothagudem
MP Vaddiraju
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని,అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని, ఇంతకుముందు కూడా ఈ మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ తమ పార్టీకి చెందినవారేనని చెప్పారు.ఎంపీ రవిచంద్ర బుధవారం తనను కలిసిన ఒక టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ, ధర్మం-అధర్మానికి జరుగుతున్న పోరులో తప్పకుండా ధర్మమే గెలుస్తుందన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చనందున బడుగు బలహీన వర్గాల వారంతా కాంగ్రెస్ పాలకులపై మండిపడుతున్నారన్నారు.వృద్ధులు,


