- Advertisement -
జనసేన చేతికి పిఠాపురం కో ఆపరేటివ్ సొసైటీ
Pithapuram Cooperative Society for Janasena
పిఠాపురం
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేనపార్టీ కైవసం చేసుకుంది. పాలకవర్గం ఎన్నికల్లో అయిదువార్డులకు గానూ జనసేన 3,టీడీపీ 1,గెలుపొంద గా ఇండిపెండెంట్ ఒకరు గెలు పొం దారు.
సొసైటీలో పాలక వర్గ నూతన కమిటీ డైరెక్టర్ల ప్రమా ణస్వీకారం ఘనంగా జరిగింది. అనంతరం ఛైర్మన్,వైస్ ఛైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికల్లో ఛైర్ పర్సన్గా జనసేనపార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమీలానాగేశ్వ ర్రావు,ఆ పార్టీకే చెందిన టైల్స్ బాబీ అనే మేళం రామకృష్ణ వైస్ ఛైర్మన్గా నూ ఎన్నికయినట్లు ఎన్నికల అధి కారిగా వ్యవహరించిన దుర్గాప్రసాద్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ చెల్లుబోయిన ప్రమీలానాగే శ్వర్రావును,వైస్ ఛైర్మన్ టైల్స్ బాబీని,ఇతర డైరెక్టర్లు అరిగెల ప్రసాదరావు,అద్దంకి వేంకటరమ ణను జనసేనపార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అభినం దించారు.అనంతరం ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్,మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లా డారు.కాగా.,105 సంవత్సరాల పిఠాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ఛైర్ పర్సన్ కావడం విశేషం.జనసేన నాయకులు సూరవరపు సురేశ్,పిల్లా శివ శంకర్,మార్నీడి రంగబాబు, చెల్లుబోయిన సతీశ్,జ్యోతుల సతీశ్,ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిశోర్,ఊటా నానిబా బు,ఓగేటి మురళీ,దేవరపల్లి రామారావు తదితరులు గెలు పొందిన వారిని అభినందించారు..
- Advertisement -