జర్నలిస్టులు హక్కుల కోసం నిరంతరం. పి జే ఏ పోరాటం వీరాంజనేయులు. మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తున్నదని, జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండివైఖరిని విడనాడా లనీ, ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు. హైదరాబాద్ జర్నలిస్ట్ భవన్లో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు, పేద ప్రజల పట్ల అనేక కథనాలు రాసి సమస్యలను పరిష్కరించడంలో సాయం అందిస్తున్న జర్నలిస్టులు నిత్యం సమస్యల సుడిగుండంలో కాలిపోతున్నారని వాపోయారు. స్వాతంత్రం పొంది స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నా, ఇంకా జర్నలిస్టులు సంక్షేమం, హక్కుల విషయంలో కేంద్రంతో కొట్లాడాల్సి రావడం మీడియా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వీరాంజనేయులు కోరారు.
జర్నలిస్టులు హక్కుల కోసం నిరంతరం పిజేఏ పోరాటం
Published By Voice Today Team
343

- Advertisement -
- Advertisement -
- Tags
- citizen journalism
- citizen journalist
- death of journalism
- female journalists
- how do journalists find news
- how to be a journalist
- journalism
- journalism tips
- Journalist
- journalist hangout
- journalists
- journalists in gaza
- journalists killed
- journalists middle east
- lebanon journalist
- palestinian journalists
- print journalism
- trump attacks journalists
- trump journalists
- what is journalism
- women journalists
- women of color journalists
- young journalists



