మానవుని మనుగడకు మొక్కలే జీవనాధారం

- Advertisement -

మానవుని మనుగడకు మొక్కలే జీవనాధారం

Plants are the lifehood of human survival

రుద్రవరం
మానవుని మనుగడకు మొక్కలే జీవనాధారం అని రుద్రవరం రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్వర్వేషన్ అతడి సూచనల మేరకు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు రుద్రవరం రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఫాల్కన్ (యాంటీ పోచింగ్ క్యాంపు), చీతల్ బేస్ క్యాంప్, సాంబార్ బేస్ క్యాంప్ మరియు చౌసింగా బేస్ క్యాంపు ల యందు అటవీ శాఖ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్స్ యాంటీ  పోచింగ్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొని మొక్కలను నాటారు. ఇందులో భాగంగా మహాత్మగాంధీ జయంతికి 15 రోజులు ముందుగా గాంధీ ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశముతో స్వచ్ఛత మరియు పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని రేంజ్ అధికారి తెలిపారు. మానవ మనుగడ కొనసాగించాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చు కోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కనీసము ఒక మొక్కను నాటి సంరక్షించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛహిత సేవా కార్యక్రమాల్లో భాగంగా పిలుపునివ్వడమైనదని ఆయన తెలిపారు. అడవులలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ ను వాడరాదని ,100% ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని తెలుపడమైనది. ఈ కార్యక్రమంలో అహోబిలం వీఆర్వో ముర్తుజావలి, సెక్షన్ అధికారులు శ్రీనివాసుల రెడ్డి, శ మక్తర్భాషా, రానెమ్మ  ,బీట్ ఆఫీసర్స్ రామకృష్ణ , నాగేంద్రయ్య, సురేంద్ర గౌడ్, నరసింహారెడ్డి, నాగవసేనయ్య , జేమ్స్ పాల్, బేస్ క్యాంపు ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular