- Advertisement -
ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను పూర్తి చేయించండి ఎంపి గారూ
Please complete the Uppal Railway Over Bridge MP
కరీంనగర్
హుజూరాబాద్ – కమలాపూర్ మధ్య ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైలు గేటు పడడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగిపోయారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ హుజూరాబాద్ – కమలాపూర్ వద్ద ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కి నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టీ శంఖు స్థాపన చేయడం జరిగింది. నా తరువాత వినోద్ కుమార్,తరువాత బండి సంజయ్ టర్మ్ అయిపోయి మళ్ళీ ఎంపీ అయి కేంద్రమంత్రి అయ్యారు. అయినా ఈ ఫ్లే ఓవర్ మాత్రం ఇలాగే ఉంది. పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ నీ కోరుతున్నా. ఉప్పల్ ఫ్లె ఓవర్ ను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నా. ఇక్కడ ఫ్లై ఓవర్ రైల్వే పార్ట్ వరకు మాత్రమే ఆగి ఉంది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకుపోయా. రాష్ట్ర ప్రభుత్వం నుండి దీనిని పూర్తి చేయడానికి ముమెంట్ చెపిస్త. ఢిల్లీ వెళ్తున్న అక్కడ సహచర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుపోతా. బండి సంజయ్ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ రైల్వే బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నానని అన్నారు.
- Advertisement -