Tuesday, January 14, 2025

8న అనకాపల్లికి ప్రధాని మోడీ

- Advertisement -

8న అనకాపల్లికి ప్రధాని మోడీ

PM Modi to Anakapalli on 8th

కాకినాడ, డిసెంబర్ 24, (వాయిస్ టుడే)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపు ఖరారైంది. జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ అనకాపల్లి వస్తారని పార్లమెంటు సభ్యులు సీఎం రమేశ్ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్.. సహా మరి కొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.హాలో ఆంధ్రా.. అనకాపల్లిలో మరోసారి ప్రధాని ఆవాజ్‌ వినిపించనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 8న అనకాపల్లిలో పర్యటించారు ప్రధాని మోదీ. ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధికి కీలక హామీలను ఇచ్చారు కూడా. ఇటీవల నవంబర్ నెల 29వ తేదీన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతవారణం వల్ల పర్యటన రద్దయింది. అయితే, జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి వస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ సహా మరికొన్ని అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారన్నారు ఎంపీ సీఎం రమేష్‌. అనకాపల్లి జిల్లాలో అల్యూమినియం కొత్త ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ఇటీవల సిద్ధం చేశారు. కీలకమైన ఈ ప్రాజెక్టులు నిర్మాణం ద్వారా అనకాపల్లి యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లాలో మూడు కేంద్రీయ విద్యాలయాలయాలు రాబతున్నాయన్నారు. అల్యూమినియం కొత్త ప్లాంట్ ఏర్పాటుకు భూసేకరణ పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎంపీ సీఎం రమేష్‌. జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్