- Advertisement -
పోచమ్మ తల్లిని
ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల ఆర్డీవో నర్సింహ మూర్తి దంపతులు
జగిత్యాల, మార్చి 01
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట లోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లినీ ఆర్డీవో దంపతులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఆర్డీవో నర్సింహ మూర్తి దంపతులు శ్రీ లోకమాత పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఈసందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి మహా ఆశీర్వాదాన్ని అందజేశారు. అలాగే
ఆలయ కమిటీ సభ్యులు ఆర్డీవో దంపతులను శాలువాతో సత్కరించి లోకమాత పోచమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గాజుల రాజేందర్, రేపల్లె హరికృష్ణ, రాజగోపాల చారి, జనగామ గంగారం, ములస్తం మల్లికార్జున్, అంగడి మఠం చరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -