- Advertisement -
భూవివాదంలో విషప్రయోగం
Poisoning in land disputes
సిద్దిపేట
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో ప్రత్యర్థి అడ్డు తొలగించుకోవాలని మద్యంలో విషం కలిపి హత్యాయత్నం చేసారు. జగదేవ్ పూర్ (మం) తిమ్మాపూర్ లో ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహులు, గోపి మధ్య పొలం బాట విషయంలో గత కొన్నాళ్లుగా గొడవనడుస్తోంది. నర్సింహులుని చంపేస్తే సమస్య ఉండదని భావించి నర్సింహులు వీక్ నెస్ పై గోపి కన్నేసాడు. పొలం వద్ద నర్సింహులు గుడిసెలో మద్యం బాటిల్లో గడ్డిమందు కలిపి పెట్టి వెళ్లిపోయాడు. బాటిల్లో మద్యం చూసి తన మామ, బంధువుకి ఫోన్ చేసి పిలిచి నర్సింహులు మద్యం తాగాడు. మద్యం తాగిన కాసేపటికే తీవ్రమైన వాంతులతో ముగ్గురు ఆసుపత్ఇరలో చేరారు. మద్యంలో విషప్రయోగం జరిగినట్టు డాక్టర్లు వెల్లడించారు. గోపీపై అనుమానంతో బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. యాదగిరిగుట్టలో తలదాచుకున్న గోపీని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుఉ నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
- Advertisement -