వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధమైన పోకల కిరణ్ మాదిగ
హైదరాబాద్ ఫిబ్రవరి 3
వరంగల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి పోకల కిరణ్ మాదిగ సిద్ధమైనారు. ఈ మేరకు గాంధీ భవన్ లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు.గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతగా NSUI యూత్ కాంగ్రెస్,INTUC మరియు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిరోహించి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసారు పోకల కిరణ్ మాది గారి జీవిత చరిత్ర ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున వారి తల్లి 2001లో సర్పంచి గెలిచారు.అదేవిధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో 25 సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి అనుభవం తెలంగాణ ఉద్యమ పోరాటంలో భాగస్వామ్యం అనేక కేసులు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితం కలిగి వారితో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి వారి రైతు పాదయాత్రలు మల్లన్న సాగర్ రైతుల గురించి రేవంత్ రెడ్డి గారితో కలిసి దీక్షలు అనేక సందర్భాల్లో రాస్తారోకోలు పిసిసి ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ కి అనుబంధంగా మాదిగ జాతి ని అండగా నిలబెట్టి 2014, 18, 19, 2024 వరకు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసారు. ఇదే విషయాన్ని కిరణ్ మాదిగ తానూ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తనకే వరంగల్ టికెట్ కేటాయిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధమైన పోకల కిరణ్ మాదిగ
- Advertisement -
- Advertisement -