Sunday, September 8, 2024

కేంద్రంపైనే పోలవరం ఆశలు

- Advertisement -

కేంద్రంపైనే పోలవరం ఆశలు
ఏలూరు, జూన్ 27,
పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి, ఇది దశాబ్దాల కల. క్లిష్టమైన డిజైన్ అంతకు మించి సవాళ్లతో కూడిన నిర్మాణం. అనుమతులు.. డిజైన్లు, నిధులు పేరుతో ఏళ్లకేళ్లు గడిచిపోతూనే ఉన్నాయి. అరవై ఏళ్లుగా ఈ ప్రాజెక్టు చర్చల్లోనే ఉంది. రాష్ట్ర విభజన పుణ్యమా అని ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. 2014-19 మధ్య నిర్మాణం పరుగులు పెట్టినా..అత్యంత కీలకమైన సహాయ, పునరావాసంపై మాత్రం  పీటముడి పడిపోయింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చినా తాము డ్యామ్ నిర్మాణానికే నిధులిస్తామని సహాయ, పునరావాసం తమ బాధ్యత కాదని వాదించింది. తర్వాత అంచనాలను తగ్గించేసింది. ఇలాంటి సమస్యలతో వైసీపీ హయాంలో ఐదేళ్లు ఆగిపోవడంతో.. అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే మూడు, నాలుగు సీజన్లలో డ్యామ్ పూర్తి చేసినా… నీళ్లు నిలపాలంటే.. సహాయ, పునరావాసం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా  చేయాలంటే కేంద్రం నుంచి సహకారం రావాల్సిందే. మరి కేంద్రం అందుకు సిద్ధంగా ఉందా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2013 సెక్షన్ 90(1) ప్రకారం పోలవరంకు జాతీయ హోదా వచ్చింది.  సెక్షన్ 90(4) ప్రకారం, నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం పర్యవేక్షణ చేస్తే ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడం కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మిస్తే నిధులు రీఎంబర్స్ చేసేలా ఒప్పంద చేసుకున్నారు.  మొదట్లో ట్రాన్స్ ట్రాయ్, ఆ తర్వాత నవయుగ కంపెనీల ఆధ్వర్యంలో  పనులు జరిగాయి.జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి  మిగలిన పనులు  మేఘ కంపెనీని అప్పగించింది. కానీ ఆ సంస్థ పనులు వేగంగా చేపట్టడంలో విఫలమయింది. అనేక సమస్యలు వచ్చాయి.  పోలవరం ప్రధాన డ్యాం పనులు ఇప్పటికే 78 శాతం పనులు పూర్తి అయ్యాయి. అత్యంత కీలకమైన ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌డ్యామ్‌ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొట్టుకుపోయి ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయో తేల్చాలి. డయాఫ్రం వాల్‌ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్‌ వే నిర్మించే అవకాశం లేదు. దీంతో నది ప్రవాహమార్గాన్ని మార్చి, కొండలు ఉన్నచోట ఊళ్లన్నీ ఖాళీ చేయించి, అక్కడ స్పిల్‌ వే నిర్మించారు. గోదావరి మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి. ఆ కట్ట దిగువన డయాఫ్రం వాల్‌ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రధాన డ్యాం నిర్మించేందుకు వీలుగా ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలు నిర్మించారు. ప్రాజెక్టులోనే ప్రాజెక్టులోనే అత్యంత కీలక కట్టడం డయాఫ్రం వాల్‌. చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్‌తో ఈ పనులు చేయించారు. నదీగర్భంలో 70 మీటర్ల లోతు నుంచి ఈ కట్‌ ఆఫ్‌ వాల్‌ నిర్మించాల్సి వచ్చింది. జగన్‌ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడంతో 2020 వరదలకు ఈ డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. మళ్లీ డయాఫ్రం వాల్‌ నిర్మించుకోవాలి. ఇందుకు రెండు సీజన్ల సమయం పడుతుంది. ఆపైన మళ్లీ ప్రధాన డ్యాం నిర్మించాలి. అంటే ఎంత లేదన్నా ఐదేళ్లు పడుతుంది.  పోలవరం సవరించిన అంచనాలను చంద్రబాబు హయాంలో రూ.55,656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌కమిటీ రూ.47,725,74 కోట్లకు సిఫార్సు చేసింది. ఆ నిధులకు ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. మరోవైపు జగన్‌ హయాంలో తొలిదశ నిధులు అంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణను పరిగణనలోకి తీసుకుని, కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రూ.31,625 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తిచేయడం సాధ్యం కాదు.   తమకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ముంపు ప్రాంతాల నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ జాతీయ ఎస్టీ కమిషన్‌కు గిరిజనులు ఫిర్యాదుచేశారు.  దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని సీఎస్‌ను తాజాగాఎస్టీ  కమిషన్‌ ఆదేశించింది. ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంతో 196టీఎంసీలు నిల్వ చేయాలంటే  45.72 మీటర్ల కాంటూరు మేరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం 85,136 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 53,192 ఎకరాల భూమి సేకరించి  పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం రూ. ఏడు వేల కోట్లు వ్యయమవుతాయని అంచనా. ఈ మొత్తం మున్ముందు మరింత పెరిగే అవకాశాలూ ఉన్నాయి. నిర్వాసితులు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరితే.. భూముల విలువ అమాంతం పెరిగిపోతోంది.  పునరావాస గృహాల నిర్మాణానికి రూ.12,88  కోట్లు ఖర్చుచేయాలి. అంటే రాష్ట్రప్రభుత్వం రూ.26 వేల కోట్లకుపైగా   ఖర్చు చేయాల్సి ఉంటుంది.   41.15 మీటర్ల కాంటూరులో 115టీఎంసీల నిల్వకే పరిమితం చేయాలని  గత ప్రభుత్వం అనుకుంది.  కానీ  అలా చేస్తే అది బహళార్థక సాధక ప్రాజెక్టుగా కాక..త సాదాసీదా ఎత్తిపోతలగా మిగిలిపోతుంది. పోలవరం వంటి ప్రాజెక్టు పూర్తయితే.. ఒక్క ఏపీకి మాత్రమే లాభం ఉండదు. దేశానికి అదో పెద్ద ఆస్తి అవుతుంది. నదుల అనుసంధాన మహా యజ్ఞంలో అతి పెద్ద ముందడుగు పడినట్లవుతుంది. అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు అవుతుందని కేంద్రమే అనేక సార్లు చెప్పింది. అందుకే ప్రాజెక్టు పూర్తయ్యేలా కేంద్రం సహకరిస్తుందని ఆశతో ఉన్నారు. లేకపోతే అంచనాలు పెరిగిపోతూ పోవడమే తప్ప..  దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికి వస్తాయో అంచనా వేయడం కష్టం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్