- Advertisement -
కిరణ్ రాయల్ పై పోలీసులకు పిర్యాదు
Police complaint against Kiran Royal
లక్ష్మి, కిరణ్ రాయల్ బాధితురాలు
తిరుపతి
కిరణ్ రాయల్ వ్యవహారం పై బాధితురాలు లక్ష్మి సోమవారం నాడు ఎస్పీ ను కలిసి గ్రీవెన్స్ లో పిర్యాదు చేసారు. న్యాయం చేయాలని, కిరణ్ రాయల్ చేసిన అన్యాయం మొత్తం ఆధారాలు తో సహా అందజేసారు. డబ్బులు ఉన్నంత వరకు కిరణ్ రాయల్ నన్ను వాడుకున్నాడు. నా పిల్లలు భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నా. కిలాడి లేడీ అంటూ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు కిరణ్ రాయల్ అని అన్నారు. అతని మాయ మాటలకు మోసపోయాను,నా పై లక్ష రూపాయలకు చెక్ బౌన్స్ కేసు ఉంది. అతనికి, నాకు కేసులు ఉన్నాయి. నిజం ఎప్పటికైన బయట పడుతుంది. నా కుటుంబ సభ్యులు నన్ను దూరం పెట్టారు, నా బిడ్డకు సర్జరీ కు డబ్బులు అడిగితే , నాదగ్గర నుంచి ఖాళీ చెక్ తీసుకున్నాడు. నాపై నిందలు వేస్తున్నారు..నన్ను ఎంతో అవమానించాడు. నా వెనక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు అంటూ భయపెట్టాడు. ఎన్నికలు అయిపోగానే మొత్తం నగదు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాడు, నేను నమ్మాను,మోస పోయాను. కిరణ్ రాయల్ కు అమ్మాయిలను మోసం చేయమని పవన్ కల్యాణ్ చెప్పారా . పార్టీకి దూరంగా ఉండాలి అని జనసేన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 2013 నుంచి కిరణ్ రాయల్ తో సంబంధాలు ఉన్నాయి 2015 తో ముగిశాయి అంటూ అసత్య ప్రచారం చేశాడు. మానస అనే అమ్మాయిని మోసం చేశాడు, అమ్మాయి జీవితం నాశనం చేశాడు. ఆ తర్వాత నేను వచ్చాను..నేను కాక వేరొక అమ్మాయి తో చనువుగా ఉన్నాడు, కిరణ్ రాయల్ మోసగాడు అని చెప్పాను. ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పెట్టవద్దు అనుకుని ఇన్నాళ్లు బయట పెట్టలేదు. నాకు ఏపార్టీ మద్దతు లేదు, నాకు న్యాయం చేయాలని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు కోరుతున్నాను. ఈలాంటి నీచుడ్ని వదిలి పెట్టొద్దు, ఎంత మంది జీవితాలు నాశనం చేస్తాడో అని భయంగా ఉంది. నాకు డబ్బులు ఇస్తే లక్ష్మి ను వదులు కుంటాను, అని వేరొక మహిళతో చెప్పాడు. మహిళ నాతో మాట్లాడిన ఆడియో విడుదల చేసింది లక్ష్మి . వాళ్లింట్లోనే ఆ అమ్మాయిని కొట్టాడు కిరణ్ రాయల్ . ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు అంటే అర్థం కావడం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అతని అవసరం తీరిపోతే వదిలిపోతాడు. అతని అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నాకు ఇవ్వాల్సిన కోటి 20 లక్షలు రూపాయలు ఇప్పించండి. అతని సన్నిహితులు , కిరణ్ రాయల్ కాణిపాకం కు వచ్చి ప్రమాణం చేస్తాడా.. నేను ఇప్పుడే వదులు కుంటా నని అన్నారు. ఇన్నాళ్లు నన్ను చంపుతాను అంటే భయపడ్డాను, అందుకే మీడియా ముందుకు వచ్చాను. నా అత్త నుంచి వచ్చిన ఆస్తులు అమ్మి నగదు కిరణ్ ను నమ్మి ఇచ్చాను, మోస పోయాను. నా బాస్ వస్తున్నాడు డబ్బులు కావాలి అంటూ నాదగ్గర తీసుకున్నాడు. 25 సవర్ల బంగారం నా దగ్గర తీసుకున్నాడు, నాకు ఇచ్చింది 5 లక్షలు మాత్రమే ఇచ్చాడు. గత పదేళ్లుగా అతను వాడే సెల్ ఫోన్ లు , అన్ని నేనే కొనిచ్చాను , అతను అనుభవిస్తున్న ప్రతి పైసా నాదే. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. జనసేన పార్టీ నాయకులు తో నాకు ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు . మోస పోయింది నేను, మోసం చేసింది కిరణ్. జనసేన పార్టీ నుంచి వీర మహిళలు ఓట్ ఫర్ కిరణ్ అంటూ ప్రచారం చేయడం బాధాకరం. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. నా దగ్గర ఉన్న ఆధారాలు విడుదల చేస్తే, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇప్పుడే సస్పెండ్ చేస్తారు. దయచేసి ఒక ఒంటరి మహిళకు న్యాయం చేయండి, వాస్తవాలు గ్రహించండని అన్నారు.
- Advertisement -