Friday, November 22, 2024

సోషల్ మీడియా  అసభ్యకర పోస్టులపై  పోలీసుల ప్రక్షాళన

- Advertisement -

సోషల్ మీడియా  అసభ్యకర పోస్టులపై  పోలీసుల ప్రక్షాళన

Police crackdown on obscene posts on social media

తుని
వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వాటిని లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ తుని పట్టణ మరియు రూరల్ పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నారు.
తుని వైఎస్ఆర్సిపి మున్సిపల్ కౌన్సిలర్ షేక్ క్వా జాను తు,  మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఏలూరు బాలును తుని పట్టణ పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి షేర్ చేయడమే కాకుండా ఫోటోలు మార్ఫింగ్  చేసి వైరల్ చేస్తున్నందుకు వీరిపై కేసు నమోదు చేశారు . వీరితోపాటు తుని మండలం తొండంగి మండలం కోటనందూరు మండలం నుండి సుమారు 8 మంది వరకు వ్యక్తులను అరెస్టు చేసి వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు

తుని పట్టణ మరియు రూరల్ పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తుల సంస్థల వారి స్వేచ్ఛను హరించే విధంగా లేదు వారు బాధపడే విధంగా వారు ఇబ్బంది పడే విధంగా ఎవరైనా ఎటువంటి అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన కొన్ని చట్టాలు తయారుచేయబడ్డాయని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి ఒకటి మరియు రెండుసార్లు అరెస్టయి మరొక మూడోసారి కూడా అదే నేరం చేసినట్లయితే సుమారు 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు శిక్ష పడే విధంగా ఇప్పుడు చట్టాలు తయారీ కాబట్టి ఎవరైనాయెదుట వారి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా కానీ వారు ఇబ్బంది పడే విధంగా గాని ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గాని ఇంస్టాగ్రామ్  సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ విధి విధానాల వక్రీకరణ గాని వేరొక పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కంటెంట్ తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన గాని పెద్దలు ,స్త్రీలు ,ఇతరుల గౌరవం కించపరిచే విధంగా అసభ్యకరంగా కంటెంట్ తయారుచేసి ఇతర గ్రూపులకు పంపించిన గాని వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఇటువంటి వాటికి యువత దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్