Monday, March 24, 2025

బెట్టింగ్ యాప్స్ తాట తీస్తున్న పోలీసులు

- Advertisement -

బెట్టింగ్ యాప్స్ తాట తీస్తున్న పోలీసులు
హైదరాబాద్ మార్చి 22, (వాయిస్ టుడే )

Police cracking down on betting apps

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ గేమ్ లపై పోలీసులు ఫోకస్ చేశారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచనలతో ఏపీ, తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం అప్రమత్తమైంది. మెట్రో రైలు లోపల, మెట్రో రైలు కోచ్ లపై ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రకటనలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ మెట్రో రైలు కోచ్‌లు, రైలు లోపల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రకటనలు ఉన్నాయని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవయ్యాయి. దీనిపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అప్రమత్తమైంది. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు, బెట్టింగ్ గేమ్ ప్రకటనలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీస్ రెడ్డి తెలిపారు. తక్షణమే మెట్రో స్టేషన్లలో, మెట్రో రైలు కోచ్‌లపై, రైలు లోపల ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రకటనలు తొలగించాలని యాడ్ ఏజెన్సీలను, ఎల్ అండ్ టీ సిబ్బందిని ఆదేశించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్ పై స్పందించారు. తెలంగాణలో బెటింగ్ యాప్స్‌పై 2017 నుంచి బ్యాన్ ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఆడడం ఇల్లీగల్ అని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు ఉంటాయన్నారు. తాము ఆన్‌లైన్‌ నుంచి ఇప్పటివరకు 108 బెట్టింగ్ యాప్స్  తొలగించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై 800 వరకు కేసులు నమోదయ్యాయని షికా గోయాల్ వెల్లడించారు.యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌కి పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావ్ హెచ్చరించారు.నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని తెలిపారు. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. మోసపూరిత ప్రకటనలు, సందేశాలు చూసి మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగులు పెట్టడం, ఆన్లైన్‌లో గేమ్స్ ఆడటం, గుర్తింపు లేని సంస్థల్లో డబ్బు పెట్టుబడి పెట్టి ఆర్థిక నష్టాల బారిన పడుతున్నారని హెచ్చరించారు. తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్లైన్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మోసాలబారిన పడుతున్నారన్నారు. బెట్టింగ్ యాప్‌లు చాలా ప్రమాదకరమైనవి, వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు. యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపులు వస్తాయి అన్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి బానిసలుగా మారుతున్నారు. అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్లు సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో ఈ వ్యసనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి కట్టడికి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా  ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన,ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు ఆయా యాప్ నిర్వాహకుల సూచనల మేరకే ఆపరేట్ చేస్తారని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవరిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, ఇటువంటి కార్యకలాపాలపై వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నార.ు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఎస్పీ డివి శ్రీనివాస్ రావ్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్