ఏపీలో పోలీసులకూ భద్రత కరువయింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి ఫిబ్రవరి 6
ఏపీలో పోలీసులకూ భద్రత కరువయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో స్మగర్ల దాడిలో పోలీసు ఉద్యోగం చేస్తూ విధుల్లో ఉన్న గణేశ్‌ను హతమార్చడం బాధాకరమని పేర్కొన్నారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మగ్లర్లకు టికెట్లిచ్చే జగన్ ప్రభుత్వంలో ఎవరికి భద్రత లేదని విమర్శించారు.స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమిస్తుంటే పోలీసులను లెక్క చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయడం వల్ల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగంగా మారిందని నారా లోకేశ్ ఆరోపించారు. స్మగ్లింగ్‌కు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. కానిస్టేబుల్ గణేశ్‌ను చంపడం మాఫియాల దారుణాలకు పరాకాష్ట అని అన్నారు.
ఏపీలో పోలీసులకూ భద్రత కరువయింది
- Advertisement -
- Advertisement -